Sunday, December 22, 2024

వండర్ లా హైదరాబాద్ దసరా ఆఫర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్, 2023 అక్టోబర్ 14 నుండి 24వ తేదీ వరకు తమ హైదరాబాద్ పార్క్‌లో దసరా పండుగను ఉత్సాహపూరితంగా జరుపుకోనుంది. పండుగ ఆఫరింగ్స్ యొక్క విశేషమైన శ్రేణితో సందర్శకులను ఆకర్షించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సందర్శకులు మంత్రముగ్దులను చేసే బొమ్మల డ్యాన్స్ ఊరేగింపు, సున్నితమైన అలంకరణలు, రుచికరమైన ఆహారం, ఉత్తేజకరమైన గేమ్‌లు, అద్భుతమైన DJ సంగీతం మరియు మరిన్నింటి కోసం ఎదురు చూడవచ్చు.

2023లో 10 నెలలు వచ్చే సరికి, వండర్ లా హైదరాబాద్ ను ఇప్పటికే 1 మిలియన్ మంది సందర్శించారు. తమ సందర్శకులకు కొత్త అనుభవాలను సృష్టించడానికి, అందించడానికి రెండు కొత్త వాటర్ రైడ్‌లను జోడించింది. అదే లక్ష్యంకు అనుగుణంగా, హైదరాబాద్ పార్క్ సంప్రదాయం, ఉత్కంఠభరితమైన వినోదాల సమ్మేళనంతో దసరా రుచిని సందర్శకులకు అందించడానికి సిద్ధంగా ఉంది.

ఈ సంతోషకరమైన సందర్భంగా వండర్ లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ.. “దసరా అనేది వేడుకలు, కలిసి ఉండేందుకు అత్యుత్తమ సమయం, ఈ అద్భుతమైన సంప్రదాయంలో భాగం కావడానికి మేము సంతోషిస్తున్నాము. చెడుపై ఎల్లప్పుడూ విజయం ఉంటుందని తెలిపే పండుగ దసరా. ఆ వాస్తవాన్ని మనం తెలుసుకునేందుకు ఇది అత్యుత్తమ సమయం. ఈ వేడుక అందరికీ సాహసం, ఆనందం, థ్రిల్‌ను తీసుకురావాలని కోరుకుంటున్నాను. మా అద్భుతమైన పండుగ ఆఫర్లతో మా సందర్శకులను స్వాగతించడానికి, వారిని సంతృప్తి పరచడానికి వండర్ లా వద్ద మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

మీ వేడుకలను, సెలవులను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు, అద్భుతమైన ఆఫర్‌లను వండర్ లా హాలిడేస్ ప్రారంభించింది:

పుట్టినరోజు ఆఫర్: తమ పుట్టినరోజులను జరుపుకునే వ్యక్తులు తమ పుట్టినరోజుకు 5 రోజుల ముందు లేదా తర్వాత ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా వండర్ లా కి “ఉచిత పార్క్ ఎంట్రీ టిక్కెట్”ని పొందవచ్చు.

ఎర్లీ బర్డ్ ఆఫర్: మూడు రోజుల ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీ సందర్శనను సురక్షితం చేసుకోండి మరియు పార్క్ ఎంట్రీ టిక్కెట్‌లపై 10% తగ్గింపును పొందండి. మీకు అతి ముఖ్యమైన వారికి చిరస్మరణీయ అనుభవాన్ని సృష్టించడానికి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోండి!

కాలేజీ ఆఫర్: 22 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు వండర్ లా హైదరాబాద్ పార్క్‌ వద్ద పార్క్ టిక్కెట్‌లపై ఫ్లాట్ 20% తగ్గింపును పొందవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News