Monday, December 23, 2024

అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ / నాంపల్లి : దాశరథి కృష్ణమాచార్య రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డును ప్రముఖ సాహితీ వేత్త, తెలుగు, సంస్కృతిక భాషల్లో సుమారు 50 కిపైగా రచనలు చేసిన అయాచితం నటేశ్వర శర్మకి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రదానం చేశారు. ఈ మేరకు శనివారం రవీంద్ర భారతిలో ప్రముఖ సాహితీ వేత్త డా.దాశరధి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దాశరథి అవార్డు కోసం నియమించిన కమిటీ ఎంపిక చేసిన మేరకు అయాచితం నటేశ్వర శర్మకు ప్రదానం చేశామన్నారు. అనంతరం డా. దాశరథి కృష్ణమాచార్య ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లు జూలూరు గౌరీ శంకర్, అయాచితం శ్రీధర్, దీపికా రెడ్డి, శ్రీదేవి, దాశరథి కుటుంబ సభ్యులు సాహితీవేత్తలు ,కవులు, కళాకారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News