Monday, December 23, 2024

మహాకవి దాశరథికి నివాళి…

- Advertisement -
- Advertisement -

Article about Telangana poet Dasarathi

అమర కవికి నివాళి
సీసం:
చలన చిత్రములందు చవులూరు గీతముల్
తొలికాడె నే కవి
కలము వలన

వేదాల భాష్యముల్
వెలిగె తెలుగునేల
పులకించె నెవ్వాని
కలమువలన

నైజాము ప్రభుగుండె
నదిరించె రణధ్వనుల్
చెలరేగె నెవ్వాని
కలము వలన!

జైలు గోడలతోటి
జై తెలంగాణని
పలికించె నే కవి
కలము ప్రతిభ!

గీ”బానిసత్వము బ్రతుకులో
బాగుపడము
స్వేచ్ఛ వూపిరిబీల్చి జీవింత మనుచు
పాతకాసుర పాలనన్ పాతరేయ
రాతరాసిన కవి దాశరథికి
నతులు”

22-7-2022
మహాకవి దాశరథి జయంతి
సందర్భంగా
సహజకవి: గోధుమకుంట పోచయ్య, కొండాపురము

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News