Monday, January 20, 2025

ఘనంగా దాసరి జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి ఫిల్మ్ అవార్డ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ సభ్యులు, ఏబీసి ఫౌండేషన్, వాసవి ఫిల్మ్ అవార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీలో గల 24 క్రాఫ్ట్ టెక్నీషియన్లకి అవార్డ్ ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అచ్చిరెడ్డి, డైరెక్టర్స్ రేలంగి నర్సింహరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో సుమన్ అతిథులుగా విచ్చేశారు. ఇక సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలు, నాటక రంగం, పంపిణీ రంగం, సేవా రంగాల్లో ఉన్న కొంతమందికి దాసరి జీవన సౌఫల్య అవార్డ్‌ను అందజేశారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో…

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్‌సిసి) ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాసరి 75వ జయంతి వేడుకలు ఛాంబర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ సంబంధించిన పలువురితో పాటు సినీ ఫొటోగ్రాఫర్స్‌కి దాసరి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టియఫ్ ఐఐసి ఛైర్మన్ బాలమల్లు, గజ్జెల నాగేశ్వరరావు పాల్గొన్నారు. టియఫ్‌సిసి వైస్ ఛైర్మన్ ఎ.గురురాజ్, జెవిఆర్, కిరణ్,రష్మిక, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News