Friday, November 15, 2024

తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి కృష్ణమాచార్య : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కృష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సిఎం కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా దాశరథి కృష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని తెలిపారు. 2023 సంవత్సరానికిగాను అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యుల ఆశయాల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణను సాధించడంలోనూ రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్పూర్తి ఇమిడి వున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News