Monday, December 23, 2024

వడ్డేపల్లి కృష్ణకు దాశరథి స్మారక పురస్కారం ప్రదానం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: ప్రసిద్ధ మహాకవులు దాశరథి కృష్ణమాచార్య, డా.సి.నారాయణరెడ్డి జయంతుల సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వ ర్యంలో ప్రముఖ కవి, దర్శకులు వడ్డేపల్లి కృష్ణకు మహాకవి దాశరథి స్మారక పురస్కార ప్రదానోత్సవం ఆదివారం గానసభలో కళా లలిత కళావేదికలో నిర్వహిం చారు. కార్యక్రమానికి రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై కృష్ణను పురస్కారంతో సత్కరించి, ప్రసంగించారు. దాశరథి, సినారెల కమనీయ కవితా వారసుడు వడ్డేపల్లి కృష్ణ అన్నారు. వారి లాగే లలిత గీతాలు, సినిగీతాలు, రూపకాలు, గజళ్లు రచించి రాణించిన మేటి కవి అని కొనియాడారు.

సభకు ప్రముఖ కవి, విమర్శకుడు ఘంటామనోహరరెడ్డి అధ్యక్షత వహించగా, ‘దాశరథి జీవితం-,కవిత్వం’ గూర్చి డా.నాళేశ్వరం శంకరం, ‘సినారె సాహి తీ వైశిష్టం’ గూర్చి డా.టి.గౌరీశంకర్ ప్రసంగించారు. ప్రముఖ గాయనీ వి.కె.దుర్గ దాశరథి, సినారె పాటలను మధురంగా గానం చేశారు. సభాకార్య క్రమానికి ముందుగా కవిసమ్మేళనాన్ని రాధాకు సుమ నిర్వహించి, అతిథులను, కవుల్ని శాలువతో సత్కరించగా సంస్థ నిర్వాహకులు బడేసాబ్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ చంద్రమౌళి, సరోజనీదేవి, అంజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News