Monday, December 23, 2024

ఎంపి సంతోష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తనను గవర్నర్ కోటా కింద ఎంఎల్‌సి గా నామినేట్ చేయడానికి బేషరతుగా మద్దతిచ్చినందుకు బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఎంపి సంతోష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపి సంతోష్‌ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆప్యాయతతో కూడిన చిరునవ్వు, పలకరింపు తనకు ఎనలేని ఆనందాన్ని కలుగజేశాయని దాసోజు శ్రవణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ను తన ట్విట్టర్‌లో దాసోజు శ్రవణ్ పంచుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News