Thursday, January 16, 2025

కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు..

- Advertisement -
- Advertisement -
‘సి ఓటర్ సర్వే’పై దాసోజు శ్రవణ్ మండిపాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలంటూ వెల్లడి చేసిన సి ఓటర్ ఓపినియన్ పోల్స్ సర్వేపై బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బలమైన అఢ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ 62 సీట్లు గెలుస్తుందని ‘సి ఓటర్ ఒపినియన్ పోల్స్ సర్వే’ వెల్లడించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో తీవ్ర గందరగోళం, వివాదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయా సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించలేకపోతోందని అన్నారు.

బోగస్ సర్వేలతో ‘సీ ఓటర్ ఒపిీనియన్ పోల్ సర్వే’ ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. 2018లో సైతం ‘సీ ఓటర్’ సర్వే చేసిందని, 2023లో సైతం అలాంటి సర్వేనే మరోసారి చేసిందని మండిపడ్డారు. ఇది ఫేక్ సర్వే అని డిసెంబర్ 3న తేలనుందన్నారు. స్థిరమైన అభివృద్ధి కారణంగా సిఎం కెసిఆర్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భావితరాల కోసం ప్రజలు తెలంగాణ సిఎంగా కెసిఆర్‌నే కోరుకుంటున్నారని వెల్లడించారు. ఏ లీడర్ కెసిఆర్‌కు దరిదాపుల్లో కనిపించడం లేదని, ఏ పార్టీ కూడా బిఆర్‌ఎస్‌తో పోటీలో లేదన్నారు. కెసిఆర్ స్థాయిని ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు తగ్గించలేవన్నారు. రాష్ట్ర ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News