Monday, December 23, 2024

బిజెపి గూటికి దాసోజు శ్రవణ్‌..

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన దాసోజు శ్రవణ్‌ బిజెపి గూటికి చేరారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో దాసోజు కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్‌చుగ్‌ మాట్లాడుతూ.. ‘దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరడం సంతోషకరం. సంక్షేమ పనులు చూసి శ్రవణ్‌ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే’ అని పేర్కొన్నారు. కాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక మాఫియా లాగా నడుపుతున్నాడని, బిసిలను బానిసలుగా చేయాలని భావిస్తున్నాడని.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ లతో రేవంత్‌ రెడ్డి కుమ్మక్కై అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు పంపుతున్నాడని, ఇక తాను పార్టీలో ఉండలేనంటూ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Dasoju Sravan Joins BJP Party in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News