Monday, December 23, 2024

అర్థరాత్రి ఫోన్ చేసి రేవంత్ అనుచరులు బెదిరిస్తున్నారు: దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఫోన్ చేసి బెదిరించడంతో పాటు బండ బూతులు తిట్టారని తన ట్విట్టర్‌తో దాసోజు శ్రవణ్ తెలిపారు. మరోసారి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే చంపేస్తామని బెదిరించారన్నారు. గత 12.15 నిమిషాలన తన బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని దాసోజు దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనయర్లను రేవంత్ అనుచరులు బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు మంచివి కావని రేవంత్‌కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రౌడీ రాజకీయాన్ని ఎలా ప్రోత్సహిస్తుందని దాసోజు ప్రశ్నించారు.

Also Read: మాజీ ఎంఎల్‌ఎ ఇంట్లో దొంగతనం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News