జీహెచ్‌ఎంసీ ముట్టడి పిలుపు పబ్లిసిటీ కోసం పాకులాట
వరదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కార్యకర్తలను పురమాయించు
విపత్కర పరిస్థితుల్లో రాజధానిలో రాజకీయ డ్రామాలు తగదు
టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న నాలాలలతో ప్రజలు నానా ఇబ్బందులకు పడుతుంటే వారిని ఆదుకోవడం కోసం తమ ప్రాణాలని లెక్క చేయకుండా జిహెచ్‌ఏంసి యంత్రాగం ఆహరిశ్నలు శ్రమిస్తుందని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవన్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ముట్టడి పిలుపు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్త చేసి బహిరంగ లేఖ రాశారు. పోలీసులు అహోరాత్రులు పనిచేస్తుంటే, తలకుమాసిన రాజకీయాలకోసం బుద్ది జ్ఞానం లేకుండా జిహెచ్‌ఏంసి పదివేల రుపాయల ఎక్స్ గ్రేషియా పేరుమీద ముట్టడి చేయడం ధర్మమా అని ప్రశ్నించారు.
Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)
మీ చర్యలతో ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బదీయటం రేవంత్ రెడ్డికి తగిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనటానికి ఈ ముట్టడి పిలుపు స్పష్టమైన సంకేతమన్నారు. ఏ పనికైనా సమయం సందర్భం ఉండాలని బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి, సమయం సందర్భం లేకుండా సందట్లో సడేమియా మాదిరిగా ప్రభుత్వ సహాయక చర్యలు అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న జిహెచ్‌ఏంసి ముట్టడి ఒక చిల్లర పని మాత్రమే కాదు, అది సామాజిక నేరమని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతటి ఆపత్కాలంలో, విపత్కర పరిస్థితుల్లో ప్రజల కోసం వారిని పనిచేయనీయకుండా, వారి విధి నిర్వహణను అడ్డుకోవడం ముమ్మాటికీ నేరం రేవంత్ మూర్ఖ రాజకీయ డ్రామాలకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, తలాతోకా లేని రేవంత్ లాంటోడు, చుట్ట కాల్చుకుంట, నిప్పు ఇస్తావ్ అడిగినట్లుంది ఆయన రాజకీయ డ్రామాలు చూస్తుంటే ఈ చిల్లర డ్రామాలు బందు చేసి, ప్రజలకు పనికివచ్చే నిర్మాణాత్మక రాజకీయం చేయాలని, లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అనే విషయం గుర్తించాలని సూచించారు. పార్లమెంటు సభ్యుడను అనే సోయి లేకుండ, ఓట్లేసి నిన్ను గెలిపించిన పాపానికి మల్కాజిగిరి ప్రజలను విస్మరించి చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. మానవత్వమే ఉంటే, నీకు సామాజిక బాధ్యత ఉంటే మల్కాజిగిరి లో ప్రజలకు అందుబాటులో ఉండు , వారికీ సహాయకార్యక్రమాలు చేపట్టు. లేదా చేతకాకపోతే ముడుసుకొని మూలకు కూర్చో, కానీ పనికి రాని రాజకీయాలు చేయవద్దని విరుచుక పడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వరదలు వస్తుంటే గోతి కాడి నక్క లాగా చిల్లర రాజకీయాలు చేసే కక్కుర్తి రేవంత్ ఏమనాలో కాంగ్రెస్ నాయకులే నిర్ణయించుకోవాలని సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్క ముంపు ప్రాంతమైన వెళ్లి చూసాడా ఢిల్లీ లో చిల్లర రాజకీయాలతో పూట గడుపుతూ తెలంగాణ అభివృద్ధి విషయంపై మాట్లాడే నైతికత లేదన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి ఏం జరిగింది ఎంత జరిగింది, గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రాయలసీమ గ్యాంగుల భూకబ్జాల గూర్చి, సాక్షాత్తు మీ ద్వారా ప్రస్తుతం ఇబ్బందులకు గురౌతున్న సామాన్య భూబాధితుల గురించి కూడా బహిరంగ చర్చ చేద్దామని దానికి కూడా ఒక సమయం సందర్భం వస్తుందని పేర్కొన్నారు. అప్పటివరకు అగుడుపడకుండా, ఆగమాగం కాకుండా ప్రస్తుతం భారీ వర్షాలతో భాదపడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం, జిహెచ్‌ఏంసి అధికారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. నీకు చేతనైతే మీ కార్యకర్తలను సహాయకార్యక్రమాల్లో నిమగ్నమైయ్యేలా పురమాయించండి కానీ ప్రభుత్వ సహాయక చర్యలలో మోకాలు అడ్డం పెట్టడం సరికాదన్నారు.