Wednesday, January 22, 2025

నాకు ప్రాణహాని ఉంది…. కాపాడండి: దస్తగిరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని సిబిఐ కోర్టును మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సిబిఐ కోర్టులో దస్తగిరి ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశాడు. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎపి సిఎం జగన్, ఆయన సతీమణి భారతి, ఎంపి అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డిల నుంచి ప్రాణ హాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సిబిఐ కోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. మరో వైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News