అమరావతి: కడప జైలులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనని ప్రలోభాలకు గురి చేయడం వాస్తవం అని వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి తెలిపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో దస్తగిరి మీడియాతో మాట్లాడారు. గతంలో చైతన్య ప్రలోభాలపై మీడియాను అశ్రయించాలని తన భార్యకు చెప్పానని, తన భార్య జడ శ్రవణ్‌ను వేడుకుంటేనే తాను బయటకు రాగలిగానని, జైలు అధికారులు కూడా తనని ప్రలోభాలకు గురి చేసేలా ప్రవర్తించారని, సిసి కెమెరాలు పని చేసేలా బాధ్యత జైలు అధికారులదేనని పేర్కొన్నారు. జైలులో తనని రిమాండ్ ఖైదీగా కాకుండా శిక్ష పడిన ఖైదీగా చూశారని, జైలు అధికారులు తనని ఇబ్బందులు పెట్టి తన చేత లేఖ రాయించుకున్నారని, జైళ్లో జరిగిన ఘటనలపై జైళ్ల శాఖ డిజికి కూడా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. జైలులో సిసి కెమెరా పుటేజీ బయటకు తీయాలని, సిబిఐ వాళ్లు తలుచుకుంటే అన్నీ బయటకు వస్తాయన్నారు. జైలు అధికారుల తీరుపై కూడా సిబిఐని ఆశ్రయిస్తానని, కడప జైలులో ప్రలోభాలపై కడప ఎస్‌పి, సిబిఐ ఎస్‌పికి ఇవాళ లేఖ రాశానని స్పష్టం చేశారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని, వివేకాను హత్య చేయించినవాళ్లే తనపై ఇప్పుడు బురద జల్లుతున్నారని దస్తగిరి దుయ్యబట్టారు. రాజకీయ కుట్రలో భాగంగా ఎంపి టెకెట్ కోసం వివేకా హత్య జరిగిందని తెలిపారు. వివేకా హత్య వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారని, వాళ్ల సూచనలతోనే హత్య జరిగిందని దస్తగిరి ఆరోపణలు చేశారు. జై భీమ తరపున పులివెందుల ఎంఎల్‌ఎగా పోటీ చేస్తున్నానని, వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని, వివేకాను హత్య చేయించిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా? అని దస్తగిరి ప్రశ్నించారు.
వివేకా మర్డర్ కేసు… ఆ వీడియోలను బయటకు తీయాలి: దస్తగిరి
- Advertisement -
- Advertisement -
- Advertisement -