Monday, December 23, 2024

నా భర్తను చంపేస్తారు: దస్తగిరి భార్య ఆందోళన

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారడంతో తన భర్తనే వేధించడంతో పాటు జైలులో హత్య చేస్తారని దస్తగిరి భార్య షబానా ఆరోపణలు చేశారు. దస్తగిరిని ఆమె ములాఖత్‌లో కలిశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తర భర్తను వైఎస్‌ఆర్‌సి నాయకులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తన భర్తకు బెయిల్ రాకుండా ఎంపి అవినాష్ రెడ్డి, ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారని దస్తగిరిపై పోలీసులు కిడ్నాప్, ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాదాపుగా 50 రోజుల నుంచి దస్తగిరి కడప కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. వివేకా కేసులో విషయంలో రాజీకి రావాలని వైసిపి నేతలు తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డబ్బులు ఆశ చూపుతున్నారని, వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే సమస్యే లేదని తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News