Friday, December 20, 2024

World Cup 2023: లంకకు భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

లంకకు భారీ షాక్
గాయం కారణంగా ప్రపంచకప్‌కు దసున్ షనకా దూరం
న్యూఢిల్లీ: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అన్న చందంగా మారింది శ్రీలంక క్రికెట్ టీమ్ పరిస్థితి. వరుస ఓటములు, గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం, స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత ఇలా ఒకటి రెండు కాదు జట్టు నిండా సమస్యలే. ఇలాంటి తరుణంలో ఆ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. లంక జట్టు సారధి దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు.

షనకా తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది.అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News