Monday, January 20, 2025

డాటా విశ్లేషణలో మంచి ఉద్యోగావకాశాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : డాటా విశ్లేషణలో ప్రావిణ్యం సంపాదించిన విద్యార్థులకు మంచి ఉద్యోగవకాశాలు ఉన్నాయని ఎక్సెలిటిక్స్ వ్యవస్థాపకులు, సిఈఒ ఎం. కిషోర్ కుమార్ అన్నారు. అనేక సంస్థలు డాటా అనలిటిక్స్ ను వేగంగా ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యోగులకు, విద్యార్థులకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. పరిశ్రమలకు కావాల్సిన సామర్థాన్ని కలిగి ఉండటంతో పాటు అదనంగా విశ్లేషణ, అంతర్ దృష్టి ఉంటే అత్యుత్తమ ప్యాకేజీలు దక్కటం ఖాయమని అన్నారు. ఉస్మానియా యూనివర్సింటీలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ (హెచ్‌సిడిసి) సహకారంతో ఉస్మానియా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (ఒటిబిఐ)తో కలిసి ఎక్సెలిటిక్స్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News