Sunday, December 22, 2024

కొవిడ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తుల సమాచారం బహిర్గతం: టెలిగ్రామ్‌లో దర్శనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వేలాదిమంది భారతీయులకు సంబంధించిన పూర్తి సమాచారం బట్టబయలైంది. ఒక టెలిగ్రామ్ చానల్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయుల సమాచారం బహిరంగంగా దర్శనమిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆధార్ నంబర్, టెలిఫోన నంబర్, జెండర్, ఐడి కార్డు సమాచారం, పుట్టిన తేదీ తదితర వివరాలన్నీ బహిర్గతమయ్యాయి. సెల్‌ఫోన్‌లోని టెలిగ్రామ్‌లోకి వెళ్లి వ్యక్తి పేరు కొడితే చాలు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు కనపడుతున్నాయి.

ఫోర్త్ న్యూస్ అనే మలాయళ న్యూస్ వెబ్‌సైట్ కథనం ప్రకారం&కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు సంబంధించిన సమాచారమంతా టెలిగ్రామ్‌లో దర్శనమిస్తోంది. ఏ వ్యాక్సిన్ వేసుకున్నదీ, ఎక్కడ వేసుకున్నదీ కూడా తెలిసిపోతోందని కూడా వెబ్‌సైట్ పేర్కొంది.

వ్యక్తిగత సమాచారం లీకైన వ్యక్తుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, డిఎంకె ఎంపి కనిమొళి, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై, కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్(బిజెపి) ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె షేర్ చేస్తూ&ప్రభుత్వం వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని, సమాచారాన్ని లీక్ చేసిన వారిని బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.
కాగా..15 కోట్ల భారతీయులకు సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలు లీకైనట్లు 2021 జూన్‌లో వార్తలు రావడంతో అప్పట్లో దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండించింది.

టెలిగ్రామ్ బాట్‌పై లీకైన సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపి కారీ చిదంబరం..డిజిటిల్ ఇండియా వ్యామోహంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరుల గోప్యతను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని ఆరోపించారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి భారతీయుడి వ్యక్తిగత వివరాలు ఇప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని, అందులో తనది కూడా ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాల పరిరక్షణ చట్టం కోసం కేంద్రం ఎందుకు పూనుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే..గత ఏడాది జనవరిలో జాతీయ ఆరోగ్య సంస్థ సిఇఓ ఆర్‌ఎస్ శర్మ ఒక ప్రకటన చేస్తూ కోవిన్ యాప్ పూర్తి స్వదేశీ పరిజ్ఞనంతో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య రూపొందిందని, కోవిన్‌లో పొందుపరిచిన ప్రజల వివరాలు అత్యంత సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేశారు.కోవిన్‌లో సమాచారం లీకైందన్న వార్తలు నిరాధారమని ఆయన అప్పట్లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News