Monday, December 23, 2024

ప్రారంభమైన ఉచిత విద్యుత్ వినియోగదారులు డేటా సేకరణ

- Advertisement -
- Advertisement -

15 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్: ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి )పథకంలో భాగంగా లబ్దిదారులు నుంచి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్ వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ళ వద్దకు వచ్చే మీటర్ రీడర్లకు రేషన్ కార్డు (బియ్యం), ఆధార్ కార్డులను చూపించి సర్వీసు నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుత బిల్లింగ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు బిల్లులు జనరేట్ చేయని కుటుంబాల కోసం కూడా ఈ డేటా ప్రామాణికంగా ఉంటుందంటున్నారు.

ఇప్పటికే మీటర్ రీడర్లు బిల్లులు ఇచ్చినట్లయితే ప్రస్తుత బిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు వివరాలు (రేషన్ కార్డు, ఆధార్ కార్డు ) వివరాలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రజాపాలన డేటా మీటర్ రీడర్ పరికరంలో ముందుగా నమోదు చేస్తామని దీనిపై వినియోగదారులు దృష్టి సారించాలని చెబుతున్నారు. ఒక వేళ తప్పుడు డేటా, తప్పుడు మీటర్ రీడింగ్ ఇస్తే ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.కోరిన సమాచారాన్ని స్వచ్చంద ప్రాతిపదికన మాత్రమే ఇవ్వబడుతుందని, తిరస్కరించే హక్కు సదరు వినియోగదారులకు ఉంటుందని చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News