Thursday, December 26, 2024

10 లక్షల మంది లైంగిక నేరస్తుల చిట్టా రెడీ

- Advertisement -
- Advertisement -

Data of over 10.69 lakh sexual offenders

న్యూఢిల్లీ : లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10 లక్షల మంది వివరాలతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేసింది. వీటిని వివిధ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచిన కేంద్ర హోంశాఖ , వీటిని ఎప్పటికప్పుడు నవీకరిస్తూనే ఉంటామని తెలిపింది. ఇటువంటి డేటాబేస్‌ను కేవలం కొన్ని దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడే వారి వివరాలను నేషనల్ డేటాబేస్ ఆన్ సెక్సువల్ అఫెండర్స్ (ఎన్‌డిఎస్‌ఒ) లో పొందుపరిచారు. వీరి పేర్లు, అడ్రస్, ఫోటోలు, ఐడీ కార్డులతోపాటు నేరస్థుల వేలి ముద్రలను కూడా డేటాబేస్‌లో పొందుపరిచారు.

ఇప్పటివరకు 10.69 లక్షల మంది వివరాలను నిక్షిప్తం చేయగా, అత్యాచారం, గ్యాంగ్‌రేప్, మహిళలను వేధించడం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసులు ఎదుర్కొన్న వివరాలు ఇందులో ఉన్నాయి. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో సత్వర దర్యాప్తు కోసం ఈ ఎన్‌డిఎస్ సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కేంద్రహోంశాఖ వెల్లడించింది. లైంగిక నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (ఐటీఎస్‌ఎస్‌ఒ) , లైంగిక నేరస్థుల డేటాబేస్ ( ఎన్‌డిఎస్‌ఒ) లను 2018 లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇలాంటి డేటా బేస్ ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News