Sunday, December 22, 2024

అంగడి సరుకు అయ్యిందెట్లా?

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: దేశంలో సంచలనం సృష్టించిన 66కోట్ల మందికి చెందిన డేటా చోరీ కేసులో సైబరాబాద్ సిట్ అధికారులు పలు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థల నుంచే సైబర్ నేరస్థులు డేటాను చోరీ చేసి సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. డేటా చోరీ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఎనిమిది మం ది నిందితులను అరెస్టు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ సంస్థల నిర్లక్షం వల్లే దేశంలోని పలువురి డే టా సైబర్ నేరస్థుల చేతిలోకి వెళ్లిందని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటిటి, ఈ కామర్స్ వెబ్ సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లకు నోటీసులు పంపారు. అలాగే బిగ్‌బాస్కెట్, ఫోన్ పే, ఫేస్‌బుక్, పాలసీ బజార్, క్లబ్ మహీం ద్రా, ఆస్టూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెడ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, టెక్ పాలు పలు కంపెనీలకు నోటీసులు పంపారు.

వినియోగదారుల డేటా లీకేజీకి సంబందించి ఆయా కంపెనీలను నుంచి వివరణ కోరారు. డేటా చోరీ విషయం బయటపడడంతో సైబరాబాద్ పోలీసులు ఆయా కంపెనీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. డేటా లీక్ కాకుండే ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను లేఖలో పేర్కొననున్నారు. డేటా బయటికి వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై అవగాహన క ల్పించనున్నారు. ఇందులో 20 అంశాలతో కూడిన లేఖల ను పలు కంపెనీలకు పంపనున్నారు. కంపెనీల్లో పనిపచేసే ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని యాజమాన్యాలకు సూచించనున్నారు. ఇన్‌ఫర్మేషన్ యాక్ట్‌లోని నిబంధనలు అమలయ్యే లా సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. వినియోగదారులు తమ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు జాగ్రత్తలు తీ సుకోవాలని సూచిస్తున్నారు. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసే సమయంలో హూగత్తలపై అవగాహన కల్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News