Saturday, September 28, 2024

పబ్బుల కొత్త దందా

- Advertisement -
- Advertisement -

పబ్బులు వ్యాపారం కోసం కొత్త దందా మొదలు పెట్టాయి, ఇప్పటి వరకు పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి విక్రయించేవారు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి యువతులను ఎరగా వేసి వ్యాపారం చేస్తున్నారు. డేటింగ్ యాప్‌లను వాడుకుని వాటి ద్వారా కష్టమర్లను ఆకర్శిస్తున్నారు. టిండర్ యాప్‌లో ఉన్న వ్యాపారులకు యువతులతో గాలం వేస్తున్నారు. అమ్మాయిల వలలో పడిన వ్యాపారులను పబ్బుకు తీసుకుని వచ్చి నిండాముంచుతున్నారు. ఇలాంటి సంఘటన హైటెక్‌సిటీ సమీపంలోని మోష్ పబ్బులో చోటుచేసుకుంది. బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో కొత్త దందా బయటికి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి యువతి రెండు రోజుల క్రితం టిండర్ యాప్‌లో పరిచయమైంది. డేటింగ్ యాప్‌లో యువతి రితికా పేరుతో ఛాటింగ్ చేసింది. పరిచయం అయిన రెండో రోజే వ్యాపారిని హైటెక్‌సిటీ వద్ద ఉన్న గలేరియా మాల్ వద్దకు రమ్మనడంతో వ్యాపారి వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత యువతి వ్యాపారిని మోషి పబ్బుకు తీసుకుని వెళ్లింది. పబ్బులో ఖరీదైన ఫైర్ షాట్స్(ఒక షాట్‌కు రూ.2వేలు) ఆర్డర్ ఇచ్చింది. గంటలోపలే ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది, కానీ యువతికి ఎలాంటి మద్యం మత్తు రాలేదు. తర్వాత రూ. 40,505 బిల్ రావడంతో అక్కడి నుంచి చల్లగా జారుకుంది. బిల్లును చూసిన వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రూ. 40 వేల మద్యం తాగినా కూడా రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో షాక్ తిన్నాడు. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్‌ని రితికకు ఇచ్చి ఉంటారని వ్యాపారవేత్త అనుమానించాడు. బిల్లు విషయంపై పబ్బు యజమానులతో గొడపడినా కూడా వారు వినకుండా బౌన్సర్లతో బెదిరించారు. చేసేది లేక పోవడంతో బిల్లు చెల్లించి ఇంటికి వెళ్లాడు వ్యాపారవేత్త. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చిన వ్యాపారి గూగుల్‌లో పబ్బు రివ్యూస్ చూడడడంతో అసలు విషయం బయటపడింది.

వ్యాపారవేత్త లాగా చాలామంది మోసపోయినట్లు తెలుసుకున్నాడు. పబ్ యాజమాన్యం అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసం చేస్తున్నారని వ్యాపారవేత్త గుర్తించాడు. ఇలాగే ఆ అమ్మాయి, పబ్ యజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు వ్యాపారవేత్త గుర్తించాడు. కృతిక, రతిక అనే యువతులతో వ్యాపారులు, యువకులను ముగ్గులోకి దించి పబ్బుకు తీసుకుని వచ్చి రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు బిల్లులు చేసి యువకుల చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. రెండు రోజుల్లో మోషి పబ్బులో ఇలాంటి మోసాలు జరగడంతో బాధితులు లక్ష వరకు బిల్లు కట్టినట్లు తెలిసింది. కాగా పబ్బుపై ఇప్పటి వరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు తెలిసింది.

బయటికి వస్తున్న బాధితులు….
వ్యాపారి ఒక్కడే కాకుండా చాలామంది రతిక,కృతిక మోసానికి బలైనట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే తమ కూడా జరిగిన మోసం గురించి చెబుతున్నారు. తమను కూడా యాప్‌లో పరిచయమైన యువతులు మోషి పబ్బుకు పిలిచి భారీగా బిల్లు చేసి చల్లగా జరుకున్నారని, తాము మాత్రం బిల్లు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి చేతిలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మోసపోయినట్లు తెలిసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు…
మోషి పబ్బుచేస్తున్న మోసంపై మాదాపూర్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. యువతుల చేతిలో మోసపోయిన బాధితులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు కోరారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News