Sunday, December 22, 2024

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ దత్తాత్రేయ హోసబలే

- Advertisement -
- Advertisement -

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఆదివారం ప్రధాన కార్యదర్శి (సర్కార్యవాహ్) గా దత్తాత్రేయ హోసబలేని మళ్లీ ఎన్నుకుంది. 2021 నుంచి హోసబలే ఈ పదవిలో ఉంటున్నారు. మళ్లీ 2024 నుంచి 2027 వరకు ఈ పదవిలో ఆయన ఉండేలా తిరిగి ఎన్నుకున్నారు. నాగ్‌పూర్ లోని రేషింబాగ్‌లో స్మృతి భవన్ కాంప్లెక్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఆరేళ్ల తరువాత ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్‌లో ఈ సమావేశం జరగడం విశేషం. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన దాదాపు 1500 ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News