Monday, December 23, 2024

భారీ వర్షాలు… గోడ కూలి తల్లీకూతుళ్లు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Daughter and mother dead due to Wall fell

నల్గొండ: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇంట్లో గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్ లో జరిగింది. శుక్రవారం  తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా మీద పడడంతో అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతి చెందారు.  మృతులు నడికుడి లక్ష్మీ(42), ఆమె కూతురు కళ్యాణి (21)గా గుర్తించారు.  ఇటీవలే కళ్యాణికి వివాహం చేశారు. కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం వీరు జీవనం సాగిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News