ముంబయి: కూతరు తన తల్లిని చంపి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు నరికి ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూటగట్టి ఇంట్లో భద్రపరిచిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని లాల్‌బాగ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రింపల్ ప్రకాశ్ జైన్ అనే అమ్మాయి తన తల్లి వీణ ప్రకాశ్ జైన్‌తో కలిసి కలచౌకీ పోలీస్ స్టేషన్ పరధిలోని లాల్‌బాగ్ ప్రాంతంలో ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీణా ప్రకాశ్ జైన్ కనిపించడంలేదని ఆమె సోదరుడు, అల్లుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా వీణా ప్రకాశ్ జైన్ ఉంటున్న ఇంటికి పోలీసులు వచ్చారు. ఇంట్లో ఆమె కూతురు ఉండడంతో పలుమార్లు ఆమెను విచారించారు. ఇంట్లో సెర్చ్ చేయగా ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో ఓపెన్ చేసి చూడగా మృతదేహం ముక్కలు ముక్కలుగా నరికి ఉంది. ఆమె కూతురును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో అఫ్తాబ్ పూనవాలా తన ప్రియురాలు శ్రద్ధాను ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాలలో పడేసిన సంఘటన తెలిసిందే.
తల్లిని ముక్కలు ముక్కలుగా నరికి… ప్లాస్టిక్ బ్యాగ్ లో మూటకట్టిన కూతురు
- Advertisement -
- Advertisement -
- Advertisement -