Sunday, December 22, 2024

అద్దం ముక్కతో తండ్రిపై కుమార్తె దాడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్న తండ్రిపై కుమార్తె అద్దం ముక్కతో దాడి చేయడంతో తండ్రి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, అంబర్‌పేట, తులసీరామ్‌నగర్‌కు చెందిన జదీష్, సత్యమ్మ భార్యభర్తలు. వీరికి నికిత అనే కుమార్తె ఉంది, ఆమెతో కలిసి ఉంటున్నారు. జగదీష్ కూలీగా పనిచేస్తున్నాడు, సత్యమ్మ స్థానికంగా పనిచేస్తోంది.

జగదీష్ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని జగదీష్ కుమార్తెను నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన నికిత పగిలిన అద్దం ముక్కతో తండ్రిపై దాడి చేసింది. అద్దం ముక్కతో జగదీష్ గొంతులో గుచ్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జగదీష్‌ను ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కేసు నమోదుకున్న అంబర్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News