- Advertisement -
యూపీ ఎన్నికల ప్రచారంలో ఏడేళ్ల బాలిక
లక్నో: అయోధ్య తండ్రి విజయం కోసం అయోధ్యలో ఓ ఏడేళ్ల చిన్నారి ఎన్నికల ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకొంటోంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన పవన్ పాండే సమాజ్ వాది పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కుమార్తె గాయత్రి పాండే .. హాయిగా, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఆ చిన్నారి … తండ్రి విజయం కోసం ఇంటింటా ప్రచారంలో పొల్గొంటోంది. “ దయచేసి మా నాన్నకు ఓటేయండి… అఖిలేశ్ యాదవ్ జీ ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి” అంటూ ప్రచారం సాగిస్తోంది. గాయత్రి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పవన్‌పాండే 2012 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని ఓడించి అఖిలేశ్ యాదవ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2017 లో బీజేపీ వేద్ ప్రకాశ్ గుప్తా చేతిలో ఓడిపోయారు.
- Advertisement -