Wednesday, January 22, 2025

నాన్న నేను నీ వెంటే..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు కూడా శ్మశాన వాటికలోనే తనువు చాలించిన హృదయ విదారకర సంఘటన జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన దామోదర్ (82) శనివారం అర్థరాత్రి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని కూతురు సునిత తట్టుకోలేకపోయింది. ఒక ధైర్యం కోల్పోయినట్లు తీవ్ర మనోవేదనకు గురైంది.

తండ్రిని అంత్యక్రియలు చేసే సమయంలో స్మశాన వాటికలోనే కూతురు సునిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. సునిత కూడా జడ్చర్ల పట్టణంలో సాయినగర్‌లో నివాసం ఉంటూ నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం రుద్రసముద్రంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News