లక్నో: కోడలను అత్తా జీన్స్ వేసుకోవాలని వేధించడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హరిపర్వత్ ప్రాంతానికి చెందిన యువకుడికి, ఎత్మాద్‌పూర్‌లోని యువతితో సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. అత్త ప్రతీ రోజు జీన్స్ వేసుకొని మోడరన్‌గా ఉంటుంది. కోడలిని ప్రతీ రోజు జీన్స్ వేసుకోవాలని డిమాండ్ చేయడంతో ఇష్టం లేదని పలుమార్లు చెప్పింది. జీన్స్ వేసుకోమ్మని అంటుందని భర్తకు చెప్పడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం పెరిగి భార్యను భర్త చావబాదాడు. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిని కావడంతో జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తా, కోడలు, భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని పోలీసులు వెల్లడించారు.
జీన్స్ వేసుకోవాలన్న అత్త… చీరలే కడుతానని పిఎస్‌లో ఫిర్యాదు చేసిన కోడలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -