Saturday, December 21, 2024

అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె

- Advertisement -
- Advertisement -

అత్త మరణం తట్టుకోలేక కోడలు గుండె ఆగింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, గొల్లగుడిసెలు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ గుండెపోటుకు గురై మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే అత్త మృతిని తట్టుకోలేక రోదిస్తూ కోడలు చుక్కల మంగమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అత్త మృతిని తట్టుకోలేక కోడలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. అత్తాకోడళ్లు ఒకేరోజు మరణించడంతో వారి మధ్య బంధం ఎంతో గొప్పగా ఉందని, మృత్యువులో సైతం ‘నీ వెంట వస్తానంటూ’ అత్త వెనుక కోడలు వెళ్లిపోవడంతో గ్రామ ప్రజలు, బంధుమిత్రులను శోకసంద్రంలో ముంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News