Sunday, December 22, 2024

మియాపూర్ బాలిక హత్య కేసులో తండ్రే హంతకుడు

- Advertisement -
- Advertisement -

కన్న తండ్రే కాలయముడై కన్న బిడ్డను హత్య చేసిన దారుణ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీని మియాపూర్ పోలీసులు చేధించారు. వివరాలలోకి వెళితే.. మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండాకు చెందిన నరేష్ దంపతులు బ్రతుకు దెరువు కోసం నడిగడ్డ తండాకు వల సవచ్చారు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును  తండ్రి నరేష్ హత్య చేసాడు.పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి చేసేవాడు.ఒక రోజు బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టాడు. దీంతో తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక బెదిరించింది.

అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని  తండ్రి నరేష్ హత్య చేశాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి కూతురు మృత దేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి నరేష్  వెళ్లాడు. అలా వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి ఘటనా స్థలానికి వెళ్లాడన్నారు. కానీ హత్య చేసిన రోజే తన కూతురు కనిపించడం లేదని నిందితుడు భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు చేపట్టారు.పోలీసుల దర్యాప్తులో తండ్రి బాలిక మృతదేహం లభ్యమైన ప్రదేశానికి వెళ్లడం సీసీటీవీ గమనించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టాడని ఎసిపి తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News