Wednesday, January 22, 2025

ఆస్తి వివాదంలో కన్న కూతురినే చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

వైరా:ఆస్తి వివాదంలతో కన్న కూతురినే అత్యంత దారుణంగా చంపిన సంఘటన వైరా మండల పరిధిలోని తాటిపూడి గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు తన తండ్రీ వెంకయ్య తన ఆసీన్తి తన మనవరాలు ఉషశ్రీ పేరుతో రిజిష్టర్ చేయటంతో వివాదం చేలరేగింది.ఈ వివాదంపై గత కొన్ని సంవత్సరాలుగా కొర్టు చుట్టూ తిరిగిన ఇరు వర్గాలకు పరిష్కారం కాలేదు.

అయితే శుక్రవారం ఉదయం పిట్టల రాములు మధ్యం త్రాగి తన కూతురు ఉషశ్రీతో గొడవకు దిగాడు.దీంతో వారి మద్య వివాదం తీవ్రం కావటంతో రాములుతో పాటు కుమారుడు నరేష్,వెంకటేష్ గొడ్డలితో,కత్తితో ఉషశ్రీని,ఆమే భర్త పై దాడి చేశారు. ఈ దాడిలో ఉషశ్రీ(35)అక్కడికక్కడే మృతి చెందింది.తీవ్రంగా గాయపడిన ఉషశ్రీ భర్తను అంబులెన్స్‌లో ఖమ్మం తరలించారు.విషయం తెలుసుకున్న వైరా ఎసిపి రెహమాన్,ఎస్‌ఐ,పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News