Wednesday, January 22, 2025

మానసిక వేదన.. కూతురికి ఉరివేసి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: మానసిక పరిస్థితి బాగలేకపోవటంతో కూతురికి ఉరివేసి ఆ తరువాత తల్లి కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో కలకలంరేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సిఐ మహేష్ తెలిపిన ప్రకారం…. సదానందం అతని భార్య బుద్దోల్ అలివేలు (40), కూతురు లాస్య (14) , కుమారుడు మణికంఠ (11)తో కలిసి మణికొండలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో నివాసముంటున్నాడు. సదానందం గత కొంతకాలంగా ఉద్యోగం మానేసి ఇంటివద్దే ఉంటున్నాడు. భార్య అలివేలు, కూతురు, కుమారుడు కరోనా సమయం నుంచి ఎటు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు.

ఇంటి నుంచి చాలా రోజులుగా బయటకు రాకపోవడంతో వారి మానసిక పరిస్థితి బాగలేదు. కాగా కొంతకాలం నుంచి ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు ఇరుగుపొరుగు వారితో అనే వారని, అదే క్రమంలో గురువారం అలివేలు తన భర్త సదానందంకు 5000 రూపాయులు ఇచ్చి యాదగిరిగుట్టకు పంపించింది. గురువారం అలివేలు, ఆమె కూతురు పాత బట్టలను కాలుస్తుండగా ఎందుకు బట్టలు కాలుస్తున్నావని కుమారుడు ప్రశ్నించిన నువ్వు చిన్న పిల్లాడివి నీకు ఏమి తెలీదు అంటు సమాధానం ఇచ్చి వెళ్లిపోయింది. ఆ తరువాత అర్థరాత్రి 2.45 గంటల సమయంలో కూతురు లాస్యకు ఉరివేసి అనంతరం ఆమె కూడా కిచెన్‌లోని సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కుమారుడు మణికంఠను కూడా చంపాలని అనుకున్నా అతడు గాఢమైన నిద్రలో ఉండటంతో వదిలివేసింది.

తెల్లవారుజాము 3.15 గంటల సమయంలో ఆమె కమారుడు మణికంఠ నిద్రలేచి చూడగా బెడ్‌రూంలో అక్క, కిచెన్‌లో తల్లి ఉరివేసుకొని ఉండడం చూసి స్థానికులకు విషయం తెలుపగా వారు వెంటనే 100కు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కాగా కరోనా సమయం నుంచి ఇంటి నుంచి బయటకు రావడం లేదని, ఇరుగుపొరుగు వారితో కూడా వారు మాట్లాడేవారు కాదని స్థానికులు తెలిపారు. కూతురు చేతిపై డూ సంథింగ్ దట్ మేక్ యూ హ్యాపీ అని, ది గేమ్ ఇజ్ స్టార్ట్‌డ్ అని గోరింటాకుతో రాసి ఉందని, వీరి మానసిక పరిస్థితి బాగ లేదని అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News