Sunday, December 22, 2024

ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు

- Advertisement -
- Advertisement -

Daughter killed father for property in Siddipet

సిద్దిపేట : ఆస్తి కోసం ఓ కూతురు కన్న తండ్రిని చంపిన దారుణ సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మృతుడు గుడికందుల పోచయ్య (71) కి ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు లింగాల రాజేశ్వరి (30) తన భర్తతో గొడవ కారణంగా 10 సంవత్సరాలుగా తన తండ్రి ఇంటి వద్దే నివసిస్తోంది. గత కొంతకాలంగా రాజేశ్వరి తన తండ్రి పోచయ్య పేరున ఉన్న 30 గంటల భూమి, ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని తరుచూ గొడవ చేసేది. శనివారం రాత్రి పోచయ్యని అతని చిన్న కూతురు రాజేశ్వరి పళ్ళెంతో కొడుతూ… మర్మాంగాలపై కాళ్ళతో తన్నింది. తీవ్రగాయాలపాలైన బాధితుడిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో పోచయ్య మృతి చెందాడు. మృతుడి పెద్ద కూతురు గజ్జెల రాజవ్వ పిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ నరేందర్ రెడ్డిలు పరిశీలించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News