Sunday, December 22, 2024

కూతురు తల్లితో కలిసి తండ్రిని చంపి…. ప్రియుడితో మృతదేహాన్ని తగలబెట్టి

- Advertisement -
- Advertisement -

Murder

మన తెలంగాణ/ట్యూటికోరిన్ న్యూస్ : కూతురు తన తల్లితో కలిసి తండ్రిని హత్య చేసి అనంతరం ప్రియుడితో కలిసి మృతదేహాన్ని అడవిలో తగలబెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రం ట్యూటికోరిన్ జిల్లాలో జరిగింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోవలిపట్టి అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతిదేహం పోలీసులకు కనిపించడంతో శవ పరీక్ష స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహం జ్ఞానశేఖర్‌దిగా పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జ్ఞాన శేఖర్ ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వాళ్లు చెప్పే సమాధానాలకు పొంతన లేకపోవడంతో పక్కింటి వారి నుంచి సమాచారం సేకరించారు.

శనివారం జ్ఞానశేఖర్, అతడి భార్య ఇద్దరు గొడవ పెట్టుకున్నారని ఇరుగుపొరుగు వారు చెప్పారు. వెంటనే భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానం పడుతూ ఉండేవాడని, పెద్ద అమ్మాయికి కార్తీక్ (24) అనే యువకుడితో ప్రేమలో ఉండడంతో ఆమెను పలుమార్లు తండ్రి మందలించాడు. తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి తండ్రిని చంపారు. అనంతరం మృతదేహాన్ని మాయ చేసేందుకు కార్తీక్ సహాయం తీసుకున్నారు. కార్తీక్ మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో తగలబెట్టినట్టు పోలీసులకు విచారణలో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి….

చందానగర్ లో భార్యను కత్తెరతో పొడిచి…. భర్త ఆత్మహత్య

సాదుకున్నందుకు చంపేసింది…

భార్య చేతి వేళ్లను నరికి…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News