Wednesday, January 22, 2025

తల్లిని చంపిన కూతురు…. ఎందుకో తెలిస్తే షాకవుతారు

- Advertisement -
- Advertisement -

Daughter killed her mother in Delhi

ఢిల్లీ: ప్రియుడితో కాకుండా భర్తతో కాపురం చేయాలని కూతురును మందలించినందుకు… కన్న తల్లిని స్నేహితుడితో కలిసి కడతేర్చిన సంఘటన ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుధా రాణి అనే మహిళా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఉంది. 2007 మున్సిపల్ ఎన్నిలలో సుధారాణి పోటీ చేసింది. సుధారాణికు దివ్యాణి అనే కూతురు ఉంది. భర్తతో గొడవ పడి దివ్యాణి పుట్టింట్లో ఉంటుంది. దివ్యాణి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తతో కలిసి ఉండాలని ప్రియుడ్ని వదిలిపెట్టాలని పలుమార్లు కూతురును తల్లి హెచ్చరించింది. కూతురు మాత్రం ప్రియుడితో ఉండడంతో డబ్బులు ఇవ్వనని, బంధం తెచ్చుకోవాల్సి వస్తుందనని పలుమార్లు హెచ్చరించింది. దీంతో తల్లిని తప్పిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని కూతురు భావించింది.

దివ్యాణి తన స్నేహితుడు కార్తీక్ చౌహాన్ సహాయంతో తన తల్లిని అంత చేయాలని నిర్ణయం తీసుకుంది. శనివారం తల్లి, మేనమామకు నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చింది. తల్లి నిద్రలోకి జారుకోగానే దివ్యాణి కార్తీక్‌కు సమాచారం ఇచ్చింది. వెంటనే కార్తీక్ అక్కడికి చేరుకొని సుధారాణి గొంతును కత్తితో కోసి హత్య చేశాడు. బంగారు నగలు, డబ్బులు తీసుకొని కార్తీక్ వెళ్లిపోయాడు. దివ్యాణి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన తల్లిని హత్య చేసి ఇంట్లో నగదు, బంగారం ఎత్తు కెళ్లారని తెలిపింది. విచారణలో దివ్యాణి  చెప్పిన సమాధానికి ఎక్కడ పొంతనలేకపోవడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేయించానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News