Monday, December 23, 2024

ప్రెగ్నెసీ టెస్టు కిట్లు ఉన్నాయని కూతురు గొంతు నులిమి

- Advertisement -
- Advertisement -

లక్నో: కన్న కూతురు వద్ద ప్రెగ్నెసీ టెస్టు కిట్లు లభించడంతో అనుమానంతో ఆమెను తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నరేష్-శోభాదేవి అనే దంపతులు అలమాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూతురు ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండడంతో ఆమెపై తల్లిదండ్రులు అనుమానం ఉండడంతో మందలించారు. కూతురు వద్ద ప్రెగ్నెసీ టెస్టు కిట్లు లభించడంలో అనుమానం నిజంకావడంతో తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహం గుర్తించకుండా శరీరంపై బ్యాటరీలో యాసిడ్ పోశారు. మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ శివారులోని ఓ కాలువలో పడేశారు. ఫిబ్రవరి 3న తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఎటువంటి ఆచూకీ కనిపించలేదు. తల్లిదండ్రుల వ్యవహారంపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే తల్లిదండ్రులతో వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News