Wednesday, December 25, 2024

సంబంధానికి అడ్డుగా ఉందని… కూతురు తన ప్రియుడితో కలిసి తల్లిని

- Advertisement -
- Advertisement -

భోపాల్: బాయ్ ఫ్రెండ్‌తో కూతురు చనువుగా ఉండొద్దని హెచ్చరించినందుకు తల్లిని వారు హత్య చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మమతా కుశ్వాహ అనే మహిళ తన కూతురు (17)తో కలిసి బిండ్ ప్రాంతంలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉంటుంది. గతంలో ఆమె కూతురుని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో నిందితుడు జైలు జీవితం గడిపి విడుదల అయ్యాడు. అనంతరం కూతురు అతడి ప్రేమలో మునిగిపోయింది. అతడితో కలిసి ఉండాలని కూతురు నిర్ణయం తీసుకోవడంతో తల్లి వ్యతిరేకించింది. అక్రమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉండడంతో ఆమెను హత్య చేయాలని లవర్‌తో కలిసి కూతురు ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలిసి తల్లి గొంతు నులిమారు. అనంతరం కత్తితో పలుమార్లు ఆమె కడుపులో పొడిచి హత్య చేశారు. అదే రాత్రి మృతదేహం ఉన్న రూమ్‌లోనే తన ప్రియుడితో కలిసి కూతురు నిద్రపోయింది. యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కూతురును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News