మన తెలంగాణ/ సర్జాపూర్ న్యూస్ : దత్తత తీసుకున్న కూతురు తల్లిని చంపేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం సర్జాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోట స్ట్రీట్‌లో మునియమ్మ (75) అనే వృద్ధురాలు దత్తత తీసుకున్న కూతురు చంద్రమ్మతో కలిసి జీవిస్తోంది. శనివారం తెల్లవారుజామున మునియమ్మ కుమారుడు శ్రీనివాస్ కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడానికి మునియమ్మ ఇంటికి వచ్చాడు. తన తల్లి ఎక్కడ ఉందని చంద్రమ్మను శ్రీనివాస్ అడిగాడు. దుండగులు వచ్చి మునియమ్మను కొట్టి చంపారని శ్రీనివాస్‌కు చంద్రమ్మ తెలిపింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా మునియమ్మ తల ఎడమ భాగంలో కర్రతో బలంగా కొట్టడంతో చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. చంద్రమ్మ పలుమార్లు అడిగిన కూడా అదే సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. మునియమ్మలో ఆధీనంలో తాను ఉండడంతో ఆమెను హత్య చేశానని ఒప్పుకుంది. 38 సంవత్సరాల క్రితం ఏడు నెలల పసికందును తీసుకొచ్చి తన తల్లి పెంచి పోషించిందని శ్రీనివాస్ తెలిపాడు. ఆమెకు చంద్రమ్మ అనే పేరు పెట్టామని, 14 సంవత్సరాల క్రితం చంద్రమ్మ భర్త చనిపోవడంతో తన తల్లి దగ్గరే ఆమె ఉంటుందని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి…