Monday, January 20, 2025

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మృతుడు ఒంటెల ప్రభాకర్ రెడ్డి (42) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు చామంతి, వైష్ణవి ఉన్నారు. పెద్దకుమార్తె చామంతి తన తండ్రి చితికి నిప్పంటించి కన్న ఋణం తీర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News