Wednesday, January 22, 2025

అమ్మ కోసం దుబాయ్ నుంచి సూట్‌కేసులో టమాటాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమ్మ ర్కెను నెరవేర్చిందో కుమార్తె. దుబాయ్ నుంచి వస్తూ సూట్‌కేసులో 10 కిలోల టమాటాలు తెచ్చింది ఆ తనయ. సెలవులు గడిపేందుకు దుబాయ్ నుంచి బయల్దేరే ముందు ఒక మహిళ ఇక్కడి నుంచి నీకేం తేవాలంటూ తల్లిని అడిగింది. అందుకు ఆ తల్లి 10 కిలోల టమాటాలు తెమ్మని కోరింది. ప్రస్తుతం దేశంలో టమాటా ధరలు చుక్కలను తాకడం, కిలో టమాటా రూ. 200, అంతకుమించి పెరిగిపోవండతో ఆ తల్లి ఈ కోరిక కోరింది. తల్లి కోర్కెను తీర్చాలని నిర్ణయించుకున్న ఆ దుబాయ్ కూతురు ప్లాస్టిక్ కంటెయినర్లలో టమాటాలు పోసి వాటిని సూట్‌కుసులో భద్రపరిచి జాగ్రత్తగా తనతోపాటు విమానంలో పుట్టింటికి తీసుకువచ్చింది.

ఈ విషయాన్ని ఆమె సోదరి రేవ్స్ అనే పేరుతో ట్విట్టర్‌లో ఇటా రాసుకొచ్చింది. నా సోదరి సెలవులు గడిపేందుకు దుబాయ్ నుంచి ఇండియా వస్తూ నీకేం తేవాలని మా అమ్మను అడిగింది. మా అమ్మ 10 కిలోల టమాటాలు తేవాలని కోరింది. ఒక సూట్‌కేసులో టమాటాల కంటెయినర్లు పెట్టుకుని నా సోదరి ఇండియా వచ్చింది.

ఈ పోస్టును ఇప్పటివరకు 53 వేలమందికి పైగా వీక్షించారు. టమాటాలను ఎలా తీసుకురావాలి, కస్టమ్స్ రూల్స్ ఎలా ఉంటాయి వంటి ప్రశ్నలను కొందరు నెటిజన్లు సంధించారు. కొందరైతే ఇన్ని కిలోల టమాటాలు ఏం చేసుకుంటారని ప్రశ్నించగా పచ్చడి చేసుకుంటామని రేవ్సే జవాబిచ్చింది. టమాటాల ధరలకు రెక్కలు వచ్చిన ఈ కష్టకాలంలో తల్లి కోర్కెను తీర్చిన ఉత్తమ కుమార్తెగా మీ సోదరికి అవార్డు ఇవ్వవచ్చని ఒక నెటిజన్ కితాబిచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News