వైజాగ్: ప్రియుడు మోజులో పడి ఓ మైనర్ బాలిక కన్నతండ్రిని కత్తితో పొడిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్కయపాలెం శంకరమఠంలో ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు(17) ఓ యువకుడు(17) ప్రేమ పడింది. అతడి మోజులో పడి ఇంట్లో నుంచి రెండు లక్షల రూపాయల నగదు, ఎనిమిది తులాల బంగారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే తండ్రి కూతురును నిలదీయడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, ఏదో ఒకటి చేయాలని యువతికి మాయమాటలు చెప్పాడు. శుక్రవారం రాత్రి సమయంలో వంట గదిలో వెళ్లి కూతురు చాకు తీసుకొని నిద్రపోతున్న తండ్రి మెడపై పొడవడానికి ప్రయత్నించింది. అలజడి కాగానే వెంటనే పక్కకు జరగడంతో కత్తి వీపులో గుచ్చుకుంది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని యువతిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రియుడి మోజులో పడి డబ్బు కాజేసిందని బంధువులు ఆరోపణ చేస్తున్నారు.