తల్లితో వీడియో కాల్ మాట్లాడుతూ యత్నం, అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు, ఆస్పత్రి ఎదుట విద్యార్థిసంఘాల ధర్నా, తోటి విద్యార్థులతో మాట్లాడనివ్వని యాజమాన్యం, గంటతర్వాత ఆస్పత్రికి తరలింపుపై అనుమానాలు
మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి : రోహిణి నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లితో వీడియో కాల్ మాట్లాడుతూ చున్నీతో ఉరేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లాకేంద్రంలోని రోహిణి నర్సిం గ్ కళాశాలలో శుక్రవారం రాత్రి జరగగా శనివారం ఉదయం వెలుగుచూసింది. ఘటన జరిగాక గంట తర్వాత గానీ విద్యార్థినిని ఆస్పత్రికి తరలించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన తి రుపతి–,- రజిని దంపతుల కూతురు రవళి (20) హనుమకొండలోని రోహి ణి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. రవళి శుక్రవారం రాత్రి 10 గంటలకు తన తల్లి రజినికి వీడియో కాల్ చేసింది. తాను ఉరేసుకుని చనిపోతున్నానని చూపించింది. అప్పటికే ఉరేసుకోగా ఫోన్ కిందపడిపోయింది. వీడియోకాల్‌లో చూసిన తల్లిదండ్రులు వెంటనే రవళి రూం మేట్స్‌తో పాటు స్నేహితులకు ఫోన్‌చేసి విషయం తెలిపా రు. అనంతరం వెంటనే బయలుదేరి కళాశాలకు వచ్చారు. వచ్చేసరికి గంట సమయం అయి నా రవళిని రూం నుంచి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రవళికి ఆస్పత్రి లో చికిత్స అందజేస్తున్నారు.