Monday, January 20, 2025

తండ్రి అఘాయిత్యంతో.. గర్భం దాల్చిన కూతురు

- Advertisement -
- Advertisement -

 

తల్లిలేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి బాధ్యత మరిచి కౄరత్వానికి ఒడిగట్టాడు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కంసాన్ పల్లి గ్రామానికి చెందిన ఓ కసాయి తండ్రి 13ఏండ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లిన బాలిక తరచుగా వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి విద్యార్థి గర్భవతి అని తెలిపారు. కన్న తండ్రి చేసిన పాడుపనికి సభ్య సమాజం సిగ్గుపడాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్థులతో కలిసి కుటుంబ సభ్యులు బాలిక తండ్రి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News