Monday, January 20, 2025

కూతురే కొడుకై..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చెన్నారావుపేట: మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కొత్తపెల్లి సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా సాంబయ్య భాగ్యలక్ష్మిలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సాంబయ్య కొంత కాలం బస్ కండక్టర్‌గా, ప్రయివేటు టీచర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద కూతురు జ్యోస్నకు గత కరోనా సమయంలో వివాహం చేశాడు.

దీంతో ఆర్థిక సమస్యలతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యం పాలై ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేక శనివారం మృతిచెందాడు. సాంబయ్య మృతితో ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. కనీసం దహన సంస్కరణలకు కూడా ఆర్థికంగా లేని పరిస్థితి. కుటుంబ పెద్ది దిక్కు మృతిచెందడంతో బోరుమంటుంది. దాతలు మానవతా దృక్పథంతో ఆర్థికసాయం అందించాలని కోరారు. సాయం చేయాలనుకునే వారు గూగుల్ పే నంబరు 8096446184కు సాయం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News