Tuesday, December 17, 2024

ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కూతురు

- Advertisement -
- Advertisement -

Daughter who murder father for property

సిద్దిపేట
జిల్లా
కోహెడ మండలంలో దారుణం

మన తెలంగాణ/కోహెడ : పెంచిన మమకారాన్ని మరిచి, ఆస్తి కోసం కన్న తండ్రిని కడతేర్చిందో కూతురు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గుడికందుల పోచయ్య (71)కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు లింగాల రాజేశ్వరీ (30) తన భర్తతో విభేదాల కారణంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి తండ్రి ఇంటి వద్దే నివాసం ఉంటుంది. వింజపల్లి గ్రామ శివారులో తన తండ్రి పోచయ్య పేరున ఉన్న 30గుంటల భూమితోపాటు ఇంటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని రాజేశ్వరీ తరుచూ పోచయ్యతో గొడవ పడుతూఉండేది. ఈ తరుణంలో శనివారం రాత్రి పోచయ్య భోజనం చేస్తున్న సమయంలో రాజేశ్వరీ తండ్రితో గొడవపడి, పళ్లెంతో పోచయ్యను కొడుతూ.. మర్మాంగాలపై కాళ్లతో తన్నింది. వృద్దుడు పోచయ్య అరుపులకు స్థానికులు వచ్చి, రాజేశ్వరీని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే కుప్పకూలి పడిపోయిన పోచయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో మృతిచెందాడు. దీంతో స్థానికులు పోచయ్య పెద్ద కూతురైన గజ్జెల రాజవ్వకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి పెద్ద కుమార్తె గజ్జెల రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని హుస్నాబాద్ సిఐ రఘుపతి రెడ్డి, ఎస్‌ఐ నరేందర్ రెడ్డిలు పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News