Tuesday, December 17, 2024

‘డాటర్స్ డే’ ఫోటోలు షేర్ చేసిన సినీ సెలబ్రిటీలు

- Advertisement -
- Advertisement -

Shilpa and karan

ముంబయి: సెప్టెంబర్ 26(ఆదివారం)   ‘డాటర్స్ డే’ సందర్భంగా నటి శిల్పాశెట్టి తన కూతురు సమీష ఫోటోను, వీడియోను నెట్‌లో పోస్ట్ చేసింది. ఆమె తన కూతురు ఫోటోను ఇదివరకెన్నడూ పోస్ట్‌చేయలేదు. ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకలప్పుడు తీసిన తన కూతురు వీడియోను ఆమె పోస్ట్‌చేశారు. ఆ వీడియోలో సమీష, శిల్పాశెట్టి ప్రక్కన కూర్చుని ఉండడం కనిపిస్తుంది.
వీడియోను షేర్ చేసిన శిల్పా “హ్యాపీ డాటర్స్ డే టు అజ్, మైన్ అండ్ అవర్స్…థాంక్యూ ….ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ లవ్ యూ, మై బేబీ!” అని కూడా రాసి పోస్ట్‌చేసింది.
శిల్ప, రాజ్‌కుంద్రకు అద్దెగర్భం(సరోగసి) ద్వారా ఈ కూతురు 2020 ఫిబ్రవరి 15న పుట్టింది. శిల్పకు వివాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. వివాన్ తర్వాత ఆమెకు మరో సంతానం కలుగలేదు. ఆటో ఇమ్యూన్ జబ్బు ఎపిఎల్‌ఎ కారణంగా ఆమెకు అన్నీ గర్భస్రావాలే అయ్యాయి. దాంతో ఆమె అద్దె గర్భం ద్వారా ఈ అమ్మాయిని కన్నది. తాను నాలుగేళ్లు వేచి చూశాక సరోగసి ద్వారా ఈ అమ్మాయిని పొందింది.
ఇదేవిధంగా ఫిలింమేకర్ కరణ్ జోహార్ కూడా తన కూతురు రూహి ఫోటోను నెట్‌లో షేర్ చేశాడు. అతడు తన పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ అప్‌డేట్ చేస్తుంటాడు. కానీ డాటర్స్ డే సందర్భంగా తాజా ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అతడు “మై హార్ట్, మై బేబీ గర్ల్. హ్యాష్‌టాగ్ హ్యాపీ డాటర్స్ డే” అంటూ రాశాడు. కరణ్ జోహార్ సరోగసి ద్వారా కవలలను కన్నారు. కూతురు రూహి కాగ, కొడుకు యష్. తన తల్లిపేరు హీరూ జోహార్ వచ్చే కూతురుకు రూహి అని, తన తండ్రి యష్ జోహార్ వచ్చేలా కొడుకుకు యష్ అని పేరు పెట్టుకున్నాడు కరణ్ జోహార్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News