Friday, January 10, 2025

ఆస్తి కోసం కన్నతండ్రిని హత్య చేసిన కూతుళ్ళు..

- Advertisement -
- Advertisement -

రాజంపేట: కన్నతండ్రిని హత్య చేసిన కూతుళ్ళ ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను 302 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజంపేట మండల కేంద్రంలో ఈ నెల 12న అర్ధరాత్రి జరిగిన కొప్పుల ఆంజనేయులు మృతి కేసులో ప్రత్యేక సాక్షులు, వాంగ్మూలం, విచారణలో పథకం ప్రకారమే ఆస్తి కోసం కన్న కూతుర్లు నీలవతి, లక్ష్మినర్సవ్వ, మృతుడి మనవడు భానుప్రసాద్ కలిసి తండ్రి కొప్పుల ఆంజనేయులును ఇంటికి నిప్పు పెట్టి కాల్చి చంపి వేశారని బిక్కనూర్ సిఐ తిరుపతయ్య తెలిపారు. శనివారం స్థానిక ఎస్సై రాజుతో కలిసి అయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

రాజంపేట గ్రామానికి చెందిన కొప్పుల ఆంజనేయులు (70)కు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురికి వివాహాలు జరిపించాడు. నడిపి కూతురు నీలవతి కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయి గ్రామంలో కొడుకు భానుప్రసాద్‌తో ఉంటుంది. తరుచూ ఆస్తి కోసం వివాదం జరుగుతు ఉండేది. ఈ క్రమంలో నీలవతికి రెండు ఎకరాలు రాసి ఇచ్చాడు అంజనేయులు. అది చాలదు అంటు రోజు గొడవకు దిగుతుండేది. ఈ క్రమంలోనే అదివారం చిన్న కూతురు బిడ్డ ఫంక్షన్ ఉండడంతో ముందుగా ప్లాన్ వేసుకొని మృతుడి కూతుళ్లు నీలవతి, లక్ష్మినర్సవ్వ, మనుమడు భానుప్రసాద్ కలిసి మద్యం సేవించి కామారెడ్డికి ఫంక్షన్‌కు వెళ్ళి వచ్చి పెట్రోల్ పోసి ఆంజనేయులును చంపివేశారు. ఎవరికి అనుమానం రాకుండా అత్మహత్యలాగా చిత్రీకరించేలా ప్రయత్నం చేశారు.

గ్రామస్తులు, బంధువులు పోలీసులకు సమాచారంతో పాటు నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, వాంగ్మూలం, విచారణలో పథకం ప్రకారమే ఆస్తి కోసం కన్న కూతుర్లు నీలవతి, లక్ష్మినర్సవ్వ, మనవడు భానుప్రసాద్ ఆంజనేయులుకు నిప్పుపెట్టి కాల్చి చంపి వేసినారని దీనిలో నిందుతులను అరెస్టు చేసి కామారెడ్డి కోర్టులో హాజరు పర్చగా జడ్జి ఆదేశానుసారం నిందితులను రిమాండ్ నిమిత్తం నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలు, స్వప్న ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News