Tuesday, December 24, 2024

తండ్రిని హత్య చేసి… ఇల్లును తగలబెట్టిన కూతుళ్లు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: పది లక్షల రూపాయల కోసం కన్నతండ్రిని హత్య చేసి ఇంటికి కూతుళ్లు నిప్పంటించిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంజనేయులు (75) అనే వృద్ధుడు రాజంపేట మండల కేంద్రంలో నివసిస్తున్నాడు. వృద్ధుడుకి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆంజనేయులుకు ఉన్న ఎకరం భూమి అమ్మి పది లక్షల రూపాయలు తన దగ్గర ఉంచుకున్నాడు. పది లక్షల రూపాయల అందరికి సమానంగా పంచాలని తండ్రితో కూతుళ్లు గొడవలకు దిగారు. తండ్రి పది లక్షల రూపాయలు ఇవ్వకపోవడంతో ముగ్గురు కూతుళ్లు తండ్రిని హత్య చేసి అనంతరం ఇల్లును తగలబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News