చెన్నై: కూతుళ్లు తల్లిని చంపి అనంతరం బొమ్మలకు రక్తం పూసి ఆడుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం పాలయమ్ కొట్టాయ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కెటిసి నగర్‌లో ఉషా అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తోంది. కూతుళ్లను భర్త వదిలేయడంతో తల్లి దగ్గరే ఉంటుంది. పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ జీవితం సాగిస్తోంది. మంగళవారం ఇంట్లో నుంచి ఉషా బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు అనుమానం వ్యక్తం చేశారు. ఉషా కూతుళ్లలో ఒక ఆమె బయటకు వచ్చి తన తల్లి చనిపోయిందని చెప్పి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డోర్ తీయాలని కూతుళ్లను అడిగారు. కిటీకిలో నుంచి చూడగా రక్తంతో తడిచిన బొమ్మలతో వారు ఆడుకుంటున్నారు. అప్పడప్పుడు ఒకరికొకరు బిస్కెట్లు తినిపించుకుంటున్నారు. పోలీసులు ఎంత బతిమిలాడిన డోర్లు తీయకపోవడంతో వాళ్లకు సర్ది చెప్పడంతో తలుపులు ఓపెన్ చేశారు. వెంటనే ఇద్దరు కూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిని రాడ్‌తో తలపై కొట్టిన తరువాత కడుపులో పొడిచామని తెలిపారు. వారి మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో మానసిక వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.