Tuesday, January 21, 2025

ప్రియురాలిని పెళ్లాడిన ఫేమస్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఓ ఇంటివాడయ్యాడు. కేప్ టౌన్ లో తన ప్రియురాలు కామిలా హారిస్‌ను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మిల్లర్-హారిస్ పెళ్లి వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను హారస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. గత సంవత్సరం బీచ్‌లో తన ప్రియురాలు రింగ్ ఇచ్చి తన ప్రేమను తెలియజేశాడు. అతడి ప్రేమతో ఆమె తడిసి ముద్దయింది. అప్పటి నుంచి ప్రేమ పక్షులు పార్కులు, బీచ్ ల వెంట విహరించాయి. ఇవాళ ఈ ప్రేమ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటిగా మారాయి. మిల్లర్ బ్యాటింగ్‌కు దిగాడంటే చాలు సునామీ సృష్టిస్తాడు. 173 వన్డేలలో 4458 పరుగులు, 116 టి20ల్లో 2270 పరుగులు, ఐపిఎల్‌లో 121 మ్యాచ్‌లు ఆడిగా ఒక సెంచరీతో 2714 పరుగులు చేశాడు. క్రికెట్ అభిమానులు మాత్రం అతడిని మిల్లర్ కిల్లర్‌గా పిలుచుకుంటారు.

David miller married camilla harris

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News